ఈసారి నేను అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:03 PM
ఈసారి నేను అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యమని, డీఎండీకే పార్టీ ఫీనిక్స్ పక్షి లాంటిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అన్నారు. ఆమె మాట్లాడుతూ... పడిలేచిన కెరటంలా మళ్ళీ పైకొస్తుందని ఆమె అన్నారు. కొద్దిరోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
- డీఎండీకే ఫీనిక్స్ పక్షిలాంటిది
- ఈసారి అసెంబ్లీలో అడుగుపెడతాం
- ప్రేమలత ధీమా
చెన్నై: డీఎండీకే ఫీనిక్స్ పక్షి లాంటిందని, పడిలేచిన కెరటంలా మళ్ళీ పైకొస్తుందని, ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) ధీమా వ్యక్తం చేశారు. తెన్‌కాశి జిల్లా ఆలంకులం వద్ద రోడ్‌షోలో ఆమె మాట్లాడుతూ డీఎండీకే ఫినిక్స్ పక్షి లాంటిదని అలాగే తమ పార్టీ సుస్థిరంగా ఉంటుందన్నారు. విజయకాంత్ ముఖ్యమంత్రి అయ్యుంటే ఐదేళ్లపాటు పరిపాలించి ప్రజలకు సేవలందించి ఉండేవారని, అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరి హృదయాల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్నారన్నారు.

పార్టీ శ్రేణులంతా ఎదురుచూస్తున్నట్లే త్వరలో ఓ మంచి కూటమిలో పార్టీ స్థానం సంపాదించుకుని ఎన్నికల్లో విజయ ఢంకాను మోగిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆలంకులం వద్ద తనకు స్వాగతం పలుకుతూ అసెంబ్లీ ముందు తాను నిలిచి ఉన్నట్లు బ్యానర్‌ను పోలీసులు తొలగించారని, బ్యానర్ తొలగించినంత మాత్రానా తాను అసెంబ్లీకి వెళ్ళలేనా అని ప్రశ్నించారు. ఆమెతోపాటు పార్టీ యువజన విభాగం కార్యదర్శి విజయ ప్రభాకరన్ కూడా ప్రసంగించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ధరలు రికార్డు స్థాయిలో డౌన్! నేటి రేట్స్ ఇవీ
Read Latest Telangana News and National News