Home » DMDK
ఉత్తరాది వారికి తమిళనాడు రాష్ట్రంలో ఓటు హక్కు కల్పించడమేంటని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రశ్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాది వాసులకు ఓటు హక్కు కల్పిస్తే, రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు
టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్‌పై డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్‌లో టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ విజయ్ మాత్రం నోరు మెదపకపోవడం ఎంతో వేదనకు గురిచేస్తోందని ఆమె అన్నారు.
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మెగా కూటమి ఏర్పాటు చేస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రకటించారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా నేతల సమావేశంలో ఆమె ప్రసంగించారు.
గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్ ధ్వజమెత్తారు.
అన్ని పార్టీలతోనూ డీఎండీకే స్నేహపూర్వకంగానే మెలగుతోందని, అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుపై చర్చించేందుకు ఇప్పటి వరకు ఏ కూటమి నుంచి కూడా తమకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అన్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆరోపించారు. తంజావూరులో ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తు ఖరారవుతుందని పేర్కొన్నారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తనకు సోదరుడితో సమానమని, ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించలేదని, అయితే మీడియాలో తాను విమర్శించినట్లు వస్తున్న కథనాలు అవాస్తవమని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత పేర్కొన్నారు.
‘సినీ, రాజకీయ రంగాల్లో రికార్డులు సాధించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన రోల్ మోడల్’ అని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత పేర్కొన్నారు. జీసీసీ ప్రధాన కార్యాలయం రిప్పన్ భవనం సమీపంలో తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మద్దతు ప్రకటించిన ప్రేమలత, సోమవారం వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
డీఎండీకే వ్యవస్థాకులు దివంగత విజయ్‌కాంత్ ఫొటోను ఏ రాజకీయ పార్టీ వాడకూడదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత హెచ్చరించారు. జిల్లాస్థాయిలో డీఎండీకే బలోపేతం కోసం ప్రేమలత రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభించారు.
కాంగ్రెస్ నిర్వహించిన సభలో డీఎండీకే తరుఫున సుధీశ్ పాల్గొనడం తప్పుకాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్‌కాంత్(Premalatha Vijaykanth) పేర్కొన్నారు.