Share News

Premalatha: ప్రేమలత సంచలన కామెంట్స్.. జయ నా రోల్‌ మోడల్‌

ABN , Publish Date - Aug 12 , 2025 | 10:48 AM

‘సినీ, రాజకీయ రంగాల్లో రికార్డులు సాధించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన రోల్‌ మోడల్‌’ అని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత పేర్కొన్నారు. జీసీసీ ప్రధాన కార్యాలయం రిప్పన్‌ భవనం సమీపంలో తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మద్దతు ప్రకటించిన ప్రేమలత, సోమవారం వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

Premalatha: ప్రేమలత సంచలన కామెంట్స్.. జయ నా రోల్‌ మోడల్‌

- డీఎండీకే అధినేత్రి ప్రేమలత

చెన్నై: ‘సినీ, రాజకీయ రంగాల్లో రికార్డులు సాధించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) తన రోల్‌ మోడల్‌’ అని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) పేర్కొన్నారు. జీసీసీ ప్రధాన కార్యాలయం రిప్పన్‌ భవనం సమీపంలో తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మద్దతు ప్రకటించిన ప్రేమలత, సోమవారం వారిని పరామర్శించారు.


ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే మేనిఫేస్టోలో ఉన్న హామీల్లో జీసీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామన్న హామీ కూడా ఉందని, అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేనందువల్లే సుమారు 2 వేల మందికి పైగా కార్మికులు ఆందోళన చేస్తున్నారని, అయినా మేయర్‌ ప్రియ, కార్పొరేషన్‌ అధికారులు,


nani2.2.jpg

మంత్రులు వీరికి న్యాయం చేయకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలితలు వారికి వారే సాటి అని, వారిని ఎవ్వరితోను పోల్చలేమన్నారు. ఇదిలా ఉండగా, జయలలితతో ప్రేమలత ఉన్నట్లు డీఎండీకే కోశాధికారి ఎల్కే సుధీష్‌ విడుదల చేసిన ఫొటో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..

చట్టాలు తెలుసుకుని అమెరికా రండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 12 , 2025 | 10:48 AM