Share News

US Consulate Urges Students to Respect Laws: చట్టాలు తెలుసుకుని అమెరికా రండి

ABN , Publish Date - Aug 12 , 2025 | 05:54 AM

అంతర్జాతీయ విద్యార్థిగా అమెరికా వెళ్లి ఉన్నత విద్య అభ్యసించడం ప్రతి విద్యార్థికి లభించే అద్భుతమైన అవకాశం...

US Consulate Urges Students to Respect Laws: చట్టాలు తెలుసుకుని అమెరికా రండి

  • వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం

  • విద్యార్థులకు యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ లౌరా విలియమ్స్‌ సూచన

హైదరాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ విద్యార్థిగా అమెరికా వెళ్లి ఉన్నత విద్య అభ్యసించడం ప్రతి విద్యార్థికి లభించే అద్భుతమైన అవకాశం, గౌరవమని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ లౌరా విలియమ్స్‌ అన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ విద్యార్థులుగా ఎదగాలని కోరారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్న త విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అమెరికా రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన యూఎస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాకు వచ్చే ప్రతి పౌరుడిని తమ ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. ‘అమెరికా రండి.. మా చట్టాలను గౌరవించండి.. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం ఉపేక్షించబోం’ అని చెప్పారు. స్టూడెంట్‌ వీసాపై వెళ్లేవారు అమెరికా చట్టాలను పూర్తిగా తెలుసుకోవాలని, బాధ్యతాయుత పౌరులుగా ప్రవర్తించాలని సూచించారు. ఈ ఫెయిర్‌లో అమెరికాలోని 30కి పైగా యూనివర్సిటీలు పాల్గొని తాము అందించే కోర్సుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాయి.

Updated Date - Aug 12 , 2025 | 05:55 AM