Share News

Premalatha: లేదు లేదు.. ఆయన్ని నేనేం విమర్శించలేదు..

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:02 PM

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తనకు సోదరుడితో సమానమని, ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించలేదని, అయితే మీడియాలో తాను విమర్శించినట్లు వస్తున్న కథనాలు అవాస్తవమని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత పేర్కొన్నారు.

Premalatha: లేదు లేదు.. ఆయన్ని నేనేం విమర్శించలేదు..

- ఈపీఎస్‏ను విమర్శించలేదు: ప్రేమలత

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తనకు సోదరుడితో సమానమని, ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించలేదని, అయితే మీడియాలో తాను విమర్శించినట్లు వస్తున్న కథనాలు అవాస్తవమని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(DMDK General Secretary Premalatha) పేర్కొన్నారు. ఇటీవల చెంగల్పట్టు జిల్లా మేల్‌మరువత్తూరులో జరిగిప ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రేమలత తమ పార్టీకి రాజ్యసభ సీటు కేటాయిస్తామని ఇచ్చిన హామీని ఈపీఎస్‌(EPS) నిలబెట్టుకోకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించినట్లు సోషల్‌ మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి.

ఈ కథనాలు వాస్తవం కాదని తన ప్రసంగాన్ని సోషల్‌ మీడియా వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసిందని, ఇది ఖండించదగ్గదని గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికలు వాస్తవ కథనాలను మాత్రమే ప్రజల్లో తీసుకెళ్లాలని, రెండు రాజకీయ పార్టీల నేతల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ప్రేమలత ఆగ్రహం వ్యక్తంచేశారు.

nani2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి

‘గే’ యాప్‌ ‘గ్రైండర్‌’ ద్వారా డ్రగ్స్‌ విక్రయం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2025 | 03:06 PM