Ceasefire: తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:28 AM
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ 7,500 మంది సంతకాలతో ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ప్రతినిధులు వెల్లడించారు.
మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి
పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ప్రతినిధులు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ 7,500 మంది సంతకాలతో ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ప్రతినిధులు వెల్లడించారు. అందులో ప్రకాశ్‌రాజ్, వేణు ఉడుగుల, తమ్మారెడ్డి భరద్వాజ, ఉమామహేశ్వరరావు తదితర సినీ ప్రముఖులతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ప్రొ.ఘంటా చక్రపాణి, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివా్‌సరెడ్డి, కవి కె. శివారెడ్డి లాంటి సామాజిక, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన వారెంతోమంది ఉన్నారని తెలిపారు. పూర్వ విప్లవ విద్యార్థి వేదిక సభ్యులు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించాలని కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ సామాజిక వేత్త ఆచార్య హరగోపాల్ కోరారు.