Home » Maoist Encounter
హిడ్మా ఎన్‌కౌంటర్‌పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో సంచలన లేఖ విడుదలైంది. హిడ్మా, శంకర్లు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వస్తే పోలీసులు పట్టుకుని చంపేశారని ఆరోపించారు.
డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు మవోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
అల్లూరి జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆదివారం నిరసన దినం పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
రెండు ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టంలో జాప్యం జరుగుతోంది. దీంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఆ తొమ్మిది మృతదేహాలు ఉన్నాయి.
మావోయిస్టులు లేని ఏపీని చేయడమే లక్ష్యమని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మావోల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను డీజీపీ పరిశీలించారు.
పోలీసుల, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల వేళా ఇటీవల తుపాకీ వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ అగ్ర మావోయిస్టు నాయకుడు మల్లోజులు ఒక వీడియో సందేశం పంపారు. ఇంతకు మావోయిస్టులకు ఆయన ఇచ్చిన సందేశం ఏంటి?.. ఈ వీడియోలో చూడండి.
మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో మావో అగ్రనేత హిడ్మా మరణించగా.. ఈరోజు మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది.
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులకు హిడ్మా రాసినట్లు ఓ లేఖ ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలియజేశారు. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, మరో ఐదుగురు చనిపోయినట్లు చెప్పారు.
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్రా లడ్డా కీలక వివరాలు వెల్లడించారు.