Odisha Encounter: Odisha Encounter: ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. అమిత్ షా స్పందన..
ABN , Publish Date - Dec 25 , 2025 | 03:43 PM
ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆయన.. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు..
న్యూఢిల్లీ: ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ కూడా హతమైనట్లు ప్రకటించారు. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలిస్తామని అమిత్ షా మరోసారి ఉద్ఘాటించారు. ఒడిశాను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తామని స్పష్టం చేశారు.

గురువారం నాడు ఒడిశాలోని కంధమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉనికి ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, ప్రత్యేక బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారు. మావోయిస్టుల వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆరుగురిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ కూడా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం నిర్ధారించింది. కాగా, గణేష్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని చండూర్. గణేష్‌పై రూ. 1.10 కోట్ల రివార్డు ఉంది. గణేశ్ గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన మావోయిస్టుల బలం పెంచడం కోసం ఎంతో కృషిచేశారు.
Also Read:
వాజ్‌పేయి ప్రసంగాలు, వ్యక్తిత్వం యువతకు మార్గదర్శకాలు: కిషన్ రెడ్డి
ప్రియుడి చేతిలో హత్యకు గురైన ప్రముఖ నటి