Home » Amit Shah
ఉత్తర్ ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో వేదికగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కీలక అడుగు పడింది. ఐదు ప్రముఖ సంస్థలకు రూ. 469 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు స్థల కేటాయింపు పత్రాలు అందించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో గతంలో రాజ్యమేలిన మాఫియాను యోగి ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నోయిడాలో నిర్వహించిన 'యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2026' ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు.
దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలో రేపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఏఎన్‌టీఎఫ్ చీఫ్‌ల జాతీయ సదస్సును నిర్వహించనుంది.
ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. అయితే దీనిపై కూటమిలో ఉన్న తెలుగు దేశం సహా మరో రెండు పార్టీలు ఆచితూచి స్పందిస్తున్నాయి.
ఢిల్లీలోని సత్యనికేతన్ 4 అంతస్తుల పీజీ భవనం కూలిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. కళాశాలల్లో సరైన హాస్టల్ వసతులు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని మండిపడ్డారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదగాలంటే దేశ అంతర్గత భద్రత మరింత బలోపేతం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. జాతీయ గేయంలోని రెండు చరణాలను మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం దేశాన్ని అవమానించడమేనని విమర్శించారు.
నీట్ పరీక్ష వివాదం.. విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన ఒక అధికారిక లేఖ రాశారు.
విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు-2026 విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లును ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించే ప్రతిపాదనను లోక్‌సభ ఆమోదించింది.
పార్లమెంట్‌లో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానన్నారు.