Share News

Chandrababu Delhi: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో డిన్నర్ మీటింగ్

ABN , Publish Date - Jan 06 , 2026 | 09:27 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(బుధవారం) సాయంత్రం 3:30 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో రాత్రి డిన్నర్ మీటింగ్ చేస్తారు. తిరిగి 11:00 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకు వస్తారు.

Chandrababu Delhi: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో డిన్నర్ మీటింగ్
Chandrababu Naidu Delhi Visit

అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి 7న(రేపు) ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం వంటి కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్‌లో చంద్రబాబు చర్చలు జరపనున్నారు.


పర్యటన షెడ్యూల్:

  • బుధవారం సాయంత్రం 3:30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరతారు.

  • రాత్రి.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ జరుగనుంది.

  • రాత్రి 11:00 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విజయవాడకు తిరిగి బయలుదేరతారు.

  • అర్ధరాత్రి 1:30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

  • ఈ భేటీలో రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులు, రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 09:57 PM