Home » Delhi
‘ది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ’ గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని అమ్మనుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కీలక ప్రకటన చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వాహనదారుడిపై దాడి చేశాడు. కారులో ఉన్న యువకుడిని పదే పదే చెంపదెబ్బ కొడుతున్నట్టు ఆ వీడియోలో కనబడుతోంది.
గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం కేసులో లూథ్రా బ్రదర్స్‌ను థాయిలాండ్‌లో అరెస్టు చేశారు. వీరిని ఇవాళ ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీ పాటియాలా కోర్టులో హాజరు పర్చారు. అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఇటీవల వరుస బస్సు ప్రమాద ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని సమీపంలో ఒకేసారి నాలుగు బస్సుల్లో మంటలు అంటుకుని నలుగురు మృతిచెందారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని మాత్రమే చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని మోదీ కోరారని తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట దక్కింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపు కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు.
ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విపరీతమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు, రైళ్లు రద్దయ్యాయి.
మెడికల్ కాలేజీల అంశంపై లోక్‌సభలో వైసీపీకి ఎంపీ కేశినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రి నారా లోకేష్ కోరారు. వివిధ ప్రాజెక్ట్‌లపైనా కేంద్రమంత్రితో లోకేష్ చర్చించారు.