Share News

ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్‌ భేటీ.. ఏఐ టెక్నాలజీపై చర్చలు!

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:32 PM

న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు.

ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్‌ భేటీ.. ఏఐ టెక్నాలజీపై చర్చలు!
PM Modi Meeting Sundar Pichai

ఢిల్లీ: సాంకేతిక ప్రపంచంలో భారత్ తన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా.. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇవాళ (బుధవారం) న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ-సుందర్ పిచాయ్ మధ్య జరిగిన ఈ సమావేశం ప్రధానంగా కృత్రిక మేధ(AI), డిజిటల్ మౌలిక సదుపాయాల చుట్టూ సాగినట్లు సమాచారం. భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు చేరుకున్నారు. కాగా, సుందర్ పిచాయ్ ఫిబ్రవరి 20న శిఖరాగ్ర సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు.


ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ ‘X’ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ చేశారు. ‘AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం భారత దేశానికి తిరిగి రావడం ఆనందంగా ఉంది. ఎప్పటిలాగే చాలా మంది మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారు’ అంటూ రాసుకొచ్చారు. ఈ సదస్సులో 110కి పైగా దేశాలు, 30 అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి.


ఇవి కూడా చదవండి...

నడిరోడ్డుపై గొంతుకోసుకున్న యువకుడు.. భయాందోళనలో ప్రజలు

వైసీపీ వాయిదా తీర్మానాల తిరస్కరణ.. సభలో గందరగోళం

Updated Date - Feb 18 , 2026 | 01:32 PM