నడిరోడ్డుపై గొంతు కోసుకున్న యువకుడు.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 10:26 AM
రేణిగుంటలో ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తిరుపతి జిల్లా, ఫిబ్రవరి 18: రేణిగుంటలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద గుర్తుతెలియని యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యువకుడు చేతిలో కత్తిపట్టుకుని ఉండటంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనను చూసి చాలామంది స్థానికులు భయంతో పరుగులు తీశారు. కత్తితో గొంతు కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమై రోడ్డుపైనే పడిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
రోడ్డుపై పడి ఉన్న యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో రేణిగుంట అంబేడ్కర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
ఏడు రకాల క్యాన్సర్లను గుర్తించే కిట్!
చెరువులో మృతదేహం.. మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడిగా గుర్తింపు
Read Latest AP News And Telugu News