ఏఐ సమిట్‌లో గందరగోళం.. స్పందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ABN, Publish Date - Feb 18 , 2026 | 03:36 PM
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ జాప్యం, సమన్వయ లోపంతో ప్రతినిధులు ఇబ్బంది పడ్డారు. ఈ గందరగోళంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ జాప్యం, సమన్వయ లోపంతో ప్రతినిధులు ఇబ్బంది పడ్డారు. ఈ గందరగోళంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఏఐ సమిట్ అనేక అద్భుతమైన పరిష్కారాలను అందించిందని అన్నారు. చిన్న చిన్న లోపాలను వెంటనే పరిష్కరించామని చెప్పారు. సమిట్‌లో ఇతర ఆవిష్కరణలు, పరిష్కారాలపై దృష్టిపెట్టడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఇబ్బందులు పడ్డ ప్రతినిధులకు క్షమాపణలు తెలుపుతూ, తప్పులను సరిదిద్దుకుని భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవి చదవండి
ఘోరం.. మహిళను పలుమార్లు కత్తితో పొడిచిన వ్యక్తి
జాతీయ భద్రతకు రాహుల్ ప్రమాదకారి.. రిజిజు సంచలన వ్యాఖ్యలు
Updated at - Feb 18 , 2026 | 03:38 PM