Share News

విమానయాన రంగాన్ని శక్తివంతం చేయడానికి ఇదో పెద్ద ముందడుగు: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Feb 16 , 2026 | 09:36 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో యువనేత పాల్గొంటున్నారు. చార్లీ ఫాక్స్ ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్‌ను లోకేశ్ సోమవారం ప్రారంభించారు.

విమానయాన రంగాన్ని శక్తివంతం చేయడానికి ఇదో పెద్ద ముందడుగు: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

ఢిల్లీ, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో యువనేత పాల్గొంటున్నారు. చార్లీ ఫాక్స్ ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్‌ను లోకేశ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ పైలెట్ కేడట్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లాడారు.


విమానయాన రంగానికి ప్రపంచస్థాయి నైపుణ్యాల దిశగా కీలక ముందడుగు పడిందని తెలిపారు. అట్లాంటా పర్యటన సమయంలో ఆలోచనగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు నిజంగా రెక్కలు తొడుగుతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయి ప్రతిభతో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగాన్ని శక్తివంతం చేయడానికి ఇదో పెద్ద ముందడుగని వివరించారు. యువపైలట్ కేడట్లతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. విమానయాన భవిష్యత్తుకు కొత్త ఉత్సాహం, దిశ కనిపించిందని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 09:52 PM