ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:39 PM
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘నైస్, గుడ్, గ్రేట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలంటూ గేట్స్ కొనియాడారు..
అమరావతి, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి): గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ (Bill Gates) సోమవారం అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు కురిపించారు. ‘నైస్, గుడ్, గ్రేట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలంటూ గేట్స్ కొనియాడారు. గేట్స్‌పై ఉన్న గౌరవంతో మంత్రి నారా లోకేశ్‌తో సహా నలుగురు మంత్రులను సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి పంపించి స్వాగతం పలికారు. సచివాలయంలో మొదటి బ్లాకులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్‌గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబును చూడగానే కారు దిగుతూనే ‘హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ’.. అంటూ ముఖ్యమంత్రిని పలకరించారు గేట్స్. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సహా ఇతర క్యాబినెట్ మంత్రులను బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు పరిచయం చేశారు.
బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా తన ఛాంబర్‌లోకి వచ్చిన బిల్‌గేట్స్‌కు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిలువెత్తు చిత్రపటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించారు. శ్రీవారి ప్రాశస్త్యాన్ని, తిరుమల క్షేత్రం గొప్పదనాన్ని బిల్ గేట్స్‌కు వివరించారు సీఎం. గేట్స్ ఫౌండేషన్ బృందంతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అనంతరం ఆర్టీజీ సెంటర్‌కు గేట్స్‌ను తీసుకెళ్లారు ముఖ్యమంత్రి. తర్వాత ఆ విభాగం పనితీరును వివరించారు. పాలనా వ్యవహరాలు, విపత్తుల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విషయంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకుంటున్నామనే అంశాన్ని ఉదాహరణలతో సహా వివరించారు ముఖ్యమంత్రి. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కుప్పంలో చేపట్టిన సంజీవని ప్రాజెక్టు ప్రోగ్రెస్‌ను ముఖ్యమంత్రి వివరించగా.. దట్స్ నైస్ అంటూ మెచ్చుకున్నారు బిల్ గేట్స్. ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగంపై గ్రేట్ అంటూ గేట్స్ అభినందనలు తెలిపారు.
డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడంపై బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్కువ ధరకే అందించగలిగితే.. పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని ప్రణాళికలను.. బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్‌ను, అత్యాధునిక పద్ధతుల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. గ్రేట్‌వర్క్ అంటూ రాజధాని మాస్టర్ ప్లాన్‌ను మెచ్చుకున్నారాయన. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి వ్రణాళికలతో రాజధాని నిర్మిస్తున్నామనే విషయాన్ని వివరించారు సీఎం. రాజధాని ప్రాంతంలో మొత్తంగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించే దిశగా.. ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు బిల్ గేట్స్‌కు చెప్పారు సీఎం. అనంతరం మంత్రులు, సెక్రటరీల సమావేశానికి గేట్స్‌ను తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు, లక్ష్యాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు రావడానికి దారి తీసిన పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు.. గేట్స్ కూడా నాటి ఢిల్లీ సమావేశం, సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు, అమెరికా వెలుపల తొలి డెవలప్‌మెంట్ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం గురించి సమావేశంలో ఉన్న మంత్రులు, సెక్రటరీలకు వివరించారు బిల్‌గేట్స్. తొలి భేటీలోనే చంద్రబాబు విజనరీ ఆలోచనలను తాను గమనించానని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన బిల్‌గేట్స్ బృందం.. సాగులో టెక్నాలజీ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి ప్రశంసించారు. ప్రకృతి సాగు గురించి రైతులు, అధికారులతో చర్చించారు బిల్‌గేట్స్. అలాగే పంట ఉత్పత్తులను పరిశీలించారు. చీడపీడలకు సంబంధించిన వివరాలు అందించే AP-AIMS (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం) మొబైల్ యాప్ పనితీరును పరిశీలించారు బిల్‌గేట్స్. రైతు ఫోన్ ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించి పంటకు వచ్చిన తెగులును గుర్తించడమే కాకుండా... డ్రోన్ ద్వారా మందుల పిచికారీ చేసే విధానాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు బిల్‌గేట్స్. వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన బిల్ గేట్స్‌కు.. రైతులు స్థానిక వంటకాలను రుచిచూపించారు.
ఇవి కూడా చదవండి...
గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: మంత్రి లోకేశ్
చంద్రబాబును చూడగానే.. బిల్ గేట్స్ ఏమన్నారో తెలుసా
Read Latest AP News And Telugu News