Share News

చంద్రబాబును చూడగానే.. బిల్ గేట్స్ ఏమన్నారో తెలుసా

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:00 PM

ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్‌ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. అలాగే చంద్రబాబును చూడగానే బిల్‌ గేట్స్‌ ఆత్మీయంగా పలకరించారు.

చంద్రబాబును చూడగానే.. బిల్ గేట్స్ ఏమన్నారో తెలుసా
CM Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 16: గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆత్మీయ స్వాగతం పలికారు. సోమవారం ఏపీ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్.. అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) బిల్ గేట్స్‌ను ఆహ్వానించారు. చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. ‘హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ..?’ అంటూ సీఎం చంద్రబాబును అడిగారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి.. తన మంత్రివర్గ సహచరులను, సీఎస్ విజయానంద్‌ను బిల్ గేట్స్‌కు పరిచయం చేశారు. ఆపై రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) సేవలను బిల్ గేట్స్ పరిశీలించారు.


bill-gates-3.jpg

ఆపై బిల్ గేట్స్ సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, సాంకేతిక సాగు సహా తదితర ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు సీఎం, అధికారులు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి సర్కార్ వివరించనుంది.


ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, సవిత, అనిత, కొల్లు రవీంద్ర, కందులు దుర్గేశ్, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్య కుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి, పొంగూరు నారాయణ హాజరయ్యారు. అలాగే, వివిధ శాఖల విభాగాధిపతులు వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

ఏపీకి బిల్‌ గేట్స్‌.. సీఎం చంద్రబాబు ట్వీట్

గేట్స్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 12:12 PM