Share News

గేట్స్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:40 AM

బిల్ గేట్స్‌కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి బిల్‌ గేట్స్‌ను స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి.

గేట్స్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: మంత్రి లోకేశ్
Minister Nara Lokesh

అమరావతి, ఫిబ్రవరి 16: గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara lokesh) ఆసక్తికర ట్వీట్ చేశారు. బిల్ గేట్స్‌కు అమరావతి హృదయపూర్వక స్వాగతం పలుకుతోందని ఆయన పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్‌ను సహచర మంత్రులతో కలిసి సాదరంగా స్వాగతించడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.


గేట్స్ ఫౌండేషన్‌ చైర్మన్ బిల్‌ గేట్స్‌తో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పరిపాలన రంగాల్లో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే అంశాలపై సచివాలయంలో చర్చిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. ప్రజలకు పటిష్టమైన, అత్యంత ప్రభావం కలిగించే పరిష్కారాలను అందించేందుకు గేట్స్ ఫౌండేషన్‌తో సన్నిహితంగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సహచర మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్‌లతో కలిసి బిల్‌ గేట్స్‌ను మంత్రి లోకేశ్ స్వాగతించారు.


ఇవి కూడా చదవండి...

గన్నవరంలో బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం..

ఏపీకి బిల్‌ గేట్స్‌.. సీఎం చంద్రబాబు ట్వీట్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 11:47 AM