గన్నవరం విమానాశ్రయం వద్ద చక్కర్లు కొట్టిన బిల్ గేట్స్ విమానం..
ABN , Publish Date - Feb 16 , 2026 | 08:39 AM
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపైన బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రన్‌వే స్పష్టంగా కనిపించలేదు.
విజయవాడ, ఫిబ్రవరి 16: విజయవాడ(గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంపై బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రన్‌వే స్పష్టంగా కనిపించలేదు. దీంతో సుమారు 15 నిమిషాలపాటు గాలిలోనే విమానం నిరీక్షించాల్సి వచ్చింది.
అసలేం జరిగింది?
ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రన్‌వే స్పష్టంగా కనిపించలేదు. విమానాల రాకపోకలకు అవసరమైన విజిబిలిటీ (Visibility) కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న విమానం ఎయిర్ పోర్టుకు చేరుకున్నప్పటికీ, ఏటీసీ (ATC) సిగ్నల్ అనుమతించకపోవడంతో పైలట్లు గాలిలోనే విమానాన్ని చక్కర్లు కొట్టించారు. సుమారు 15 నిమిషాల పాటు గాలిలోనే నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం, వాతావరణం కాస్త అనుకూలించడంతో ఏటీసీ అధికారుల ఆదేశాలతో విమానం సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది.
కీలక పర్యటనపై ఉత్కంఠ
ఏపీ ప్రభుత్వంతో సంజీవని వైద్య సేవ సహా కొన్ని కీలక సామాజిక ప్రాజెక్టుల చర్చల నిమిత్తం బిల్ గేట్స్ అమరావతి వస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుతో చర్చల అనంతరం బిల్ గేట్స్ ఏ ప్రకటన చేస్తారన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..