Share News

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్.. పాకిస్థాన్ టార్గెట్ ఎంతంటే..

ABN , Publish Date - Feb 15 , 2026 | 08:42 PM

ఓపెనర్ ఇషాన్ కిషన్ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అర్ధశతకంతో అదరగొట్టాడు. దీంతో పాకిస్థాన్ ఎదుట భారత్ భారీ లక్ష్యం ఉంచింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్.. పాకిస్థాన్ టార్గెట్ ఎంతంటే..
Ishan Kishan

ఓపెనర్ ఇషాన్ కిషన్ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అర్ధశతకంతో అదరగొట్టాడు. దీంతో పాకిస్థాన్ ఎదుట భారత్ భారీ లక్ష్యం ఉంచింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు (India match update). దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది (India vs Pakistan).


బౌలింగ్‌కు అనుకూలిస్తున్న స్లో పిచ్‌పై ఆరంభంలోనే టీమిండియా అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) మాత్రం పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు (Ishan Kishan performance). పది ఫోర్లు, మూడు సిక్స్‌లతో పరుగుల వరద పారించాడు. అయుబ్ బౌలింగ్‌లో ఇషాన్ అవుటైన తర్వాత పరుగుల వేగం కాస్త నెమ్మదించింది. ఆ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (25) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. సూర్య మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దూబె (27) వేగంగా ఆడాడు.


చివరకు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది (Pakistan target 176) పాకిస్థాన్ ఎదుట 176 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. పాక్ బౌలర్లలో అయుబ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక, కెప్టెన్ సూర్యను అవుట్ చేసిన తారిక్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. షాహిన్, సల్మాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక, గత మ్యాచ్‌లతో పోల్చి చూసుకుంటే ఇది భారీ లక్ష్యం అనే చెప్పాలి. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై అక్షర్, కుల్‌దీప్, వరుణ్ వంటి స్పిన్నర్లను ఎదుర్కొని పాక్ బ్యాటర్లు ఎలా బ్యాటింగ్ చేస్తారో చూడాలి.

Updated Date - Feb 15 , 2026 | 10:23 PM