Home » India vs Pakistan
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌ను పాకిస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక ఫైనల్ పోరాటంలో కువైట్‌ను ఓడించిన పాక్ ట్రోఫీ గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ పేలవ ప్రదర్శనను కనబరిచింది.
ఆసియా కప్‌లో భారత జట్టు చేతిలో వరుసగా మూడు సార్లు ఓడిపోవడం పాకిస్థాన్ క్రికెట్‌లో సంక్షోభానికి కారణమవుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ క్రికెట్ అభిమానులతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా నఖ్వీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు ట్రోఫీ దక్కకూడదని నఖ్వీ దానిని తనతో పాటు తీసుకుపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆసియా కప్-2025 టోర్నీ ఆట కంటే ఇతర విషయాలతోనే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆటను వెనక్కి నెట్టేశాయి. మ్యాచ్ అనంతరం మైదానంలో చోటుచేసుకున్న వివాదాలే హైలైట్ అవుతున్నాయి.
తాజా ఆసియా కప్‌లో రింకూ సింగ్ ఒకే ఒక బాల్ ఆడాడు. కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ బౌండరీ బాది టీమిండియాకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశ అంతర్గత మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ట్రోఫీని అందజేస్తానని పట్టుబట్టడంతో, వేడుక గంటకు పైగా ఆలస్యమై ట్రోఫీ ప్రదానం లేకుండానే ముగిసింది.
ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అసమాన పోరాటంతో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి విజయ కేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో భారత్ చేతిలో వరుసగా మూడు సార్లు పాకిస్థాన్ ఓడిపోయింది.
ఆసియా కప్‌లో వరుసగా మూడు సార్లు టీమిండియా చేతిలో ఓడిపోవడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు జరిగిన రెండు మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనే పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేసింది.
ఆసియా కప్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒకే టోర్నీలో పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించింది. తొమ్మిదోసారి ఆసియా కప్ చేజిక్కించుకుంది. అయితే మ్యాచ్ అనంతరం దుబాయ్ మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది.
మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన సెలబ్రేషన్‌తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుకు గట్టి రిటార్ట్ ఇచ్చాడు