టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడేది లేదు.. స్పష్టం చేసిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి..
ABN , Publish Date - Feb 05 , 2026 | 09:09 AM
రాబోయే టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పష్టం చేశారు. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
రాబోయే టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పష్టం చేశారు. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్థాన్ భీష్మించుకుని కూర్చుంది. భారత్‌తో తటస్థ వేదికల్లో అయితేనే ఆడతామని ఇంతకు ముందు చెప్పిన పాకిస్థాన్ ఇప్పుడు మాట మార్చింది (Pakistan PM on India boycott).
తాజాగా భారత్‌తో టీ-20 ప్రపంచకప్‌లో ఆడేది లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా వ్యాఖ్యానించారు. 'టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడకూడదనే విషయంలో చాలా క్లారిటీతో నిర్ణయం తీసుకున్నాం. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు. మేం సరైన నిర్ణయమే తీసుకున్నాం' అని ఇస్లామాబాద్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. పాక్ తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ ఇప్పటికే తప్పు పట్టింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ప్రకటించింది (India Pakistan cricket tensions).
పాకిస్థాన్ కంటే ముందు బంగ్లాదేశ్ ఐసీసీ మీద ఒత్తిడి తీసుకొచ్చింది (T20 World Cup political row). భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. అయితే బంగ్లాదేశ్ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. భారత్‌లో భద్రతకు ఢోకా లేదని తేల్చి చెప్పింది. దీంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు బంగ్లాదేశ్ ప్రకటించింది. బంగ్లాకు మద్దతుగా ఇప్పుడు పాక్ కూడా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని చెబుతోంది. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. అలాగే ఐసీసీ నుంచి ఆంక్షలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..