Share News

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 05 , 2026 | 06:33 AM

గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం బుధవారం భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి ధరలు కూడా అమాంతంగా పైకి ఎగబాకాయి. గురువారం కూడా పెరుగుదల దిశగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 5న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం బుధవారం భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి ధరలు కూడా అమాంతంగా పైకి ఎగబాకాయి. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరల్లో పెట్టుబడులకు మళ్లీ అవకాశం కనిపించడంతో పెరుగుతున్నాయి. గురువారం కూడా బంగారం, వెండి పెరుగుదల నమోదు చేశాయి (Gold prices).


ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 5న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,59,450కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,160కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,59,600కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,46,310కి చేరుకుంది.


మరోవైపు ఇటీవల భారీగా పతనమైన వెండి కూడా క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కసారిగా పెరుగుదల నమోదు చేసింది. మళ్లీ రూ.3 లక్షల పైకి చేరుకుంది. గురువారం కూడా కిలోకు వంద రూపాయల మేర పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 1, 59, 450, రూ. 1, 46, 160

  • విజయవాడలో రూ. 1, 59, 450, రూ. 1, 46, 160

  • ఢిల్లీలో రూ. 1, 59, 600, రూ. 1, 46, 310

  • ముంబైలో రూ. 1, 59, 450, రూ. 1, 46, 160

  • వడోదరలో రూ. 1, 59, 500, రూ. 1, 46, 210

  • కోల్‌కతాలో రూ. 1, 59, 450, రూ. 1, 46, 160

  • చెన్నైలో రూ. 1, 59, 450, రూ. 1, 46, 160

  • బెంగళూరులో రూ. 1, 59, 450, రూ. 1, 46, 160

  • కేరళలో రూ. 1, 59, 450, రూ. 1, 46, 160

  • పుణెలో రూ. 1, 59, 450, రూ. 1, 46, 160


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 3, 20, 100

  • విజయవాడలో రూ. 3, 20, 100

  • ఢిల్లీలో రూ. 3, 20, 100

  • చెన్నైలో రూ. 3, 20, 100

  • కోల్‌కతాలో రూ. 3, 20, 100

  • కేరళలో రూ. 3, 20, 100

  • ముంబైలో రూ. 3, 20, 100

  • బెంగళూరులో రూ. 3, 20, 100

  • వడోదరలో రూ. 3, 20, 100

  • అహ్మదాబాద్‌లో రూ. 3, 20, 100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..

నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు

Updated Date - Feb 05 , 2026 | 06:33 AM