మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..
ABN , Publish Date - Feb 04 , 2026 | 01:56 PM
బుధవారం పార్లమెంట్ వెలుపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పటి తన సహచరుడు, ప్రస్తుతం బీజేపీ ఎంపీ అయిన రవ్‌నీత్ సింగ్ బిట్టూ మిత్ర ద్రోహి అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
బుధవారం పార్లమెంట్ వెలుపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పటి తన సహచరుడు, ప్రస్తుతం బీజేపీ ఎంపీ అయిన రవ్‌నీత్ సింగ్ బిట్టూను 'మిత్ర ద్రోహి'గా రాహుల్ గాంధీ అభివర్ణించారు. దానికి కౌంటర్‌గా రాహుల్‌ను బిట్టూ 'దేశద్రోహి'గా అభివర్ణించారు. పార్లమెంట్ వెలుపల ద్వారం దగ్గర ఈ ఇద్దరూ ఎదురుపడినపుడు వాతావరణం వేడెక్కింది (Rahul Gandhi).
కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు బుధవారం ఉదయం పార్లమెంట్ వెలుపల నిరసన తెలియజేశారు. అదే సమయంలో రవ్‌నీత్ సింగ్ బిట్టూ అక్కడకు వచ్చారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఉన్న రాహుల్ గాంధీ, రవ్‌నీత్‌ను చూసి.. 'ఇదుగో.. ఒక ద్రోహి ఇటువైపు వచ్చారు. అతడి మొహం చూడండి' అని ఎద్దేవా చేశారు. అనంతరం బిట్టూకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి ముందుకు చాచి.. 'హలో బ్రదర్.. మిత్ర ద్రోహి. కంగారు పడకు.. నువ్వు మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తావు' అని రాహుల్ వ్యాఖ్యానించారు (Rahul Gandhi controversy).
రాహుల్ గాంధీ కరచాలనం చేయడానికి చేయి ముందుకు చాచినప్పటికీ రవ్‌నీత్ సింగ్ బిట్టూ తిరస్కరించారు (Congress vs BJP). రాహుల్ గాంధీని దేశ ద్రోహిగా బిట్టూ అభివర్ణించారు. 'ఏదో యుద్ధంలో గెలిచినట్టుగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు' అంటూ బిట్టూ ముందుకు వెళ్లిపోయారు. ఆ క్రమంలో రాహుల్ గాంధీ, రవ్‌నీత్ బిట్టూ మధ్య కొద్ది సెకెన్ల పాటు మాటల యుద్ధం జరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడిన రవ్‌నీత్ బీజేపీలో చేరారు. అప్పట్నుంచి రాహుల్, రవ్‌నీత్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు.. దాడులు తీవ్రతరం చేసిన రష్యా..