Share News

స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 04 , 2026 | 06:37 AM

గత నాలుగు, ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది. వెండి ధరలు మాత్రం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 4న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price

గత నాలుగు, ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది. వెండి ధరలు మాత్రం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి. అయితే బుధవారం బంగారం మాత్రం పెరుగుదల నమోదు చేసింది (Gold prices).


ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 4న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,53,940కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,110కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,54,090కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,41,260కి చేరుకుంది.


మరోవైపు ఇటీవల భారీగా పెరిగిన వెండి కూడా స్థిరీకరణకు గురవుతోంది. భారీగా పతనమైంది. ఒక దశలో రూ.4.25 లక్షలకు చేరిన కిలో వెండి కొద్ది రోజుల్లోనే రూ.3 లక్షల దిగువకు చేరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 1, 53, 940, రూ. 1, 41, 110

  • విజయవాడలో రూ. 1, 53, 940, రూ. 1, 41, 110

  • ఢిల్లీలో రూ. 1, 54, 090, రూ. 1, 41, 260

  • ముంబైలో రూ. 1, 53, 940, రూ. 1, 41, 110

  • వడోదరలో రూ. 1, 53, 990, రూ. 1, 41, 160

  • కోల్‌కతాలో రూ. 1, 53, 940, రూ. 1, 41, 110

  • చెన్నైలో రూ. 1, 53, 940, రూ. 1, 41, 110

  • బెంగళూరులో రూ. 1, 53, 940, రూ. 1, 41, 110

  • కేరళలో రూ. 1, 53, 940, రూ. 1, 41, 110

  • పుణెలో రూ. 1, 53, 940, రూ. 1, 41, 110


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 2, 99, 900

  • విజయవాడలో రూ. 2, 99, 900

  • ఢిల్లీలో రూ. 2, 79, 900

  • చెన్నైలో రూ. 2, 99, 900

  • కోల్‌కతాలో రూ. 2, 79, 900

  • కేరళలో రూ. 2, 99, 900

  • ముంబైలో రూ. 2, 79, 900

  • బెంగళూరులో రూ. 2, 79, 900

  • వడోదరలో రూ. 2, 79, 900

  • అహ్మదాబాద్‌లో రూ. 2, 79, 900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవీ చదవండి:

ప్రాణాలతో చెలగాటం వద్దు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్

డెలివరీ ఏజెంట్ కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

Updated Date - Feb 04 , 2026 | 08:10 AM