Share News

డెలివరీ ఏజెంట్ కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

ABN , Publish Date - Feb 02 , 2026 | 08:58 PM

డెలివరీ ఏజెంట్‌ను లిఫ్ట్ ఎక్కనీయకుండా మెట్లెక్కి పైఅంతస్తులో ఉన్న ఫ్లాట్‌కు ప్యాకేజీని డెలివరీ చేయించిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. జనాలు షాకయిపోయేలా చేస్తోంది.

డెలివరీ ఏజెంట్ కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
Delivery agent lift denied

ఇంటర్నెట్ డెస్క్: అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ ఎక్కనీయకుండా ఓ డెలివరీ ఏజెంట్‌ను (Delivery Agent) అష్టకష్టాల పాలు చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలను కదిలిస్తున్న ఈ వీడియోకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. సమాజంలో మానవత్వం కరువైపోయిందని అనేక మంది ఈ వీడియోను చూశాక కామెంట్ చేస్తున్నారు (Delivery Boy Denied Lift in Apartment).

ఈ వీడియోను అభిషేక్ అనే వ్యక్తి షేర్ చేశారు. ఇందులో కనిపించిన దాని ప్రకారం, భారీ బ్యాగ్‌ను డెలివరీ చేసేందుకు ఆ ఏజెంట్ నానా కష్టాలు పడ్డాడు. భారీ బ్యాగును వీపున మోసుకుంటూ చాలా అంతస్తులు ఎక్కాడు. ఫ్లాట్ ముందుకు వచ్చేసరికి అలసిపోయాడు. ఆ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌ను వాడేందుకు డెలివరీ బాయ్స్‌కు, ప్యాకర్స్ అండ్ మూవర్స్ సిబ్బందికి అనుమతి లేదని వీడియో రికార్డు చేసిన వ్యక్తి తెలిపాడు (Viral Video).


నెట్టింట వైరల్‌గా మారిన ఈ పోస్టుపై జనాల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. డెలివరీ ఏజెంట్ అంత కష్టపడుతున్నా మనసులు కరగకపోవడం దారుణమని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఏ అపార్ట్‌మెంట్‌‌లో ఇది జరిగిందో చెప్పాలని కొందరు డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్ల తీరును నలుగురిలో ఎండగట్టాలన్నారు. సాధారణ లిఫ్ట్‌ను అపార్ట్‌మెంట్ వాసులకే పరిమితం చేసినప్పుడు, ఇతరుల కోసం సర్వీస్ లిఫ్ట్ ఏర్పాటు చేయాలని నెటిజన్లు చెప్పారు. ఇలాంటి లిఫ్ట్‌ల అవసరం లేదనే వారు ఆకాశహర్మ్యాలను నిర్మించకూడదని అన్నారు. పోలీస్ కంప్లెయిట్ ఫైల్ చేయాలని కూడా కొందరు సూచించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

బాల్య స్నేహితుడిని దారుణంగా అవమానించిన యువతి! వైరల్ వీడియో

యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..

Updated Date - Feb 02 , 2026 | 09:09 PM