బాల్య స్నేహితుడిని దారుణంగా అవమానించిన యువతి! వైరల్ వీడియో
ABN , Publish Date - Jan 30 , 2026 | 07:42 AM
చాలా కాలం తరువాత తనకు తారస పడ్డ బాల్య స్నేహితుడిని ఓ యువతి ఘోరంగా అవమానించినట్టు చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తన చిన్న నాటి స్నేహితుడు డెలివరీ బాయ్‌గా మారాడని తెలిసి ఓ యువతి దారుణంగా అవమానించినట్టున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చేసిన యువతిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇది నిజమైన ఘటనా? లేక ప్రాంక్ వీడియోనా అన్న క్లారిటీ లేకపోయినప్పటికీ జనాలు మాత్రం నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు (woman insults childhood friend video).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, చాలా ఏళ్ల తరువాత తారసపడ్డ తన స్కూల్ ఫ్రెండ్‌తో ఆ యువతి దారుణంగా వ్యవహరించింది. ‘ఇతను నా చిన్నప్పటి ఫ్రెండ్. అప్పట్లో అందరూ బాగా చదువుకోవాలని మమ్మల్ని ప్రోత్సహించేవాడు. ఇప్పుడు అతడికి 30 ఏళ్లు వచ్చాయి. పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు’ అని అంటూ అతడిని రికార్డు చేసింది. యువతి అలా తనను రికార్డు చేస్తుంటే వ్యక్తి మాత్రం ఆమెను ఏమీ అనలేక అలా ఇబ్బందిగా నవ్వుతూ నిలబడిపోయాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. అనేక మంది యువతిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవితం అనుకున్నట్టు సాగదన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అని విమర్శించారు. నిజాయతీగా పని చేసి తెచ్చుకునే ప్రతి రూపాయి అమూల్యమైనదని మరి కొందరు కామెంట్ చేశారు. చాలా ఏళ్ల తరువాత కలిసిన స్నేహితుడిని ఇంతలా అవమానించే స్థాయికి యువతి దిగజారిందంటే నమ్మలేకపోతున్నామని మరికొందరు అన్నారు.
కనీస మానవత్వం కూడా లేని స్థాయికి సమాజం దిగజారిందా? అని అనేక కామెంట్ చేశారు. మరికొందరేమో ఆ యువకుడిపై ప్రశంసలు కురిపించారు. అవమానకర స్థితిలో కూడా సంయమనం కోల్పోకుండా అతడు హుందాగా వ్యవహించిన తీరు చాలా గొప్పదని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
వామ్మో.. 65 ఏళ్లుగా ఒకే సంస్థలో మేనేజర్‌గా మహిళ! వైరల్ వీడియో!
2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టనుందా?