వామ్మో.. 65 ఏళ్లుగా ఒకే సంస్థలో మేనేజర్‌గా మహిళ! వైరల్ వీడియో!
ABN , Publish Date - Jan 28 , 2026 | 08:27 PM
ఒకే సంస్థలో మేనేజర్‌గా 65 ఏళ్లపాటు పనిచేసిన ఓ జపాన్ వృద్ధురాలి ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. జెన్ జీ తరాన్ని ఈ అంశం బాగా ఆశ్చర్యపరుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: కెరీర్‌లో వేగంగా ఎదిగేందుకు ఎల్లప్పుడూ రెడీగా ఉండే నేటి తరానికి ఒకే సంస్థలో ఏళ్లకు ఏళ్లు పనిచేయడం అంటే చెప్పలేనంత విడ్డూరంగా ఉంటుంది. దీంతో, ప్రస్తుతం ఓ జపాన్ వృద్ధురాలి ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది. 65 ఏళ్లుగా ఆమె ఒకే సంస్థలో అదీ మేనేజర్‌గా పనిచేస్తున్నారని తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అత్యధిక వయసున్న ఆఫీస్ మేనేజర్‌గా ఆమె ఇప్పటికే గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు (Japanese Woman - Oldest Office Manager).
తన సుదీర్ఘవృత్తి జీవితంతో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న ఈ మహిళ పేరు యాసుకో టమాకీ. వయసు 96 ఏళ్లు. ఒసాకాలోని సన్‌కో ఇండస్ట్రీస్ అనే సంస్థలో ఆమె గత ఆరు దశాబ్దాలుగా జనరల్ అడ్మనిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఉద్యోగుల శాలరీలు, పన్నులు, లీవ్‌ల వ్యవహారాలు చూడటం ఆమె విధులు. తాఖీదులు, ప్రశంసాపత్రాలు కూడా ఆమె చేతుల మీదుగానే ఉద్యోగులకు చేరతాయి. దాదాపు ఆరు దశాబ్దాలుగా ఆమె ఇవే విధులను నిర్వర్తిస్తున్నారు. 2021లో ఆమె అత్యధిక వయసున్న మేనేజర్‌గా గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. అప్పట్లో ఆమె వీడియో నెట్టింట సంచలనం రేకెత్తించింది.
అంతటి వృద్ధాప్యంలో కూడా ఆమె ఉత్సాహంగా ఆఫీసుకు వచ్చిన తరుణంలో సహోద్యోగులు ఆమెకు కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలికారు. గిన్నిస్ రికార్డు పొందిన సందర్భంలో ఆమెకు ఈ అద్భుత స్వాగతం లభించింది.
ప్రస్తుతం మళ్లీ వైరల్‌గా మారిన అప్పటి వీడియో జెన్ జీ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆశ్చర్యం కలిగిస్తోందని అనేక మంది కామెంట్ చేశారు. అంతకాలం పనిచేసినా ప్రమోషన్ ఎందుకు రాలేదని మరికొందరు ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టనుందా?
మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్