Share News

యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..

ABN , Publish Date - Feb 02 , 2026 | 05:43 PM

అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ కట్నం కింద రూ.71 లక్షల నగదు, 21 తులాల బంగారం తీసుకున్నాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..
Arun Panwar wedding Dowry - Viral Video

ఇంటర్నెట్ డెస్క్: అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ ఏకంగా రూ.71 లక్షల నగదు, 21 తులాల బంగారం కట్నంగా తీసుకున్నాడన్న ఆరోపణలు ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతుతున్నాయి. పెళ్లిలో బహుమతులుగా అతడు ఈ మొత్తాన్ని తీసుకున్నాడని కొందరు అంటుంటే మరికొందరేమో బహుమతి పేరిట కట్నం తీసుకున్నాడని నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. గతేడాది చివర్లో అతడి వివాహం జరగ్గా నాటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది (Arun Panwar Dowry).

సుమిత్ అనే వ్యక్తి ఈ వీడియోను నెట్టింట పోస్టు చేశారు (Arun Panwar Viral Video). పన్వర్‌ నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడని అన్నారు. ఇంత సంపాదిస్తున్నా వధువు కుటుంబం నుంచి గిఫ్ట్ పేరిట కట్నం తీసుకున్నాడని విమర్శించాడు. ఓ తట్టలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఉన్నట్టు కూడా వీడియోలో కనిపించింది.


ఇక వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఈ కాలంలో కూడా వరకట్నం కొనసాగుతుండటంపై నిరసన వ్యక్తం చేశారు. ఇందులో పాలుపంచుకున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. కట్నానికి గిఫ్ట్ అని పేరు పెట్టి కొందరు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. సంపన్న వర్గాల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగడం విచారకరమని అన్నారు. వీడియో ఇంతలా వైరల్ అవుతున్నా వరుడిని ఎందుకు అరెస్టు చేయలేదని కొందరు ప్రశ్నించారు. అతడి భార్య వైద్యురాలు అయినా కూడా కట్నం ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించిందని అన్నారు. యూట్యూబర్‌లకు ఇంత క్రేజ్ ఉందా?! అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి:

బాల్య స్నేహితుడిని దారుణంగా అవమానించిన యువతి! వైరల్ వీడియో

వామ్మో.. 65 ఏళ్లుగా ఒకే సంస్థలో మేనేజర్‌గా మహిళ! వైరల్ వీడియో!

Updated Date - Feb 02 , 2026 | 06:12 PM