ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు.. దాడులు తీవ్రతరం చేసిన రష్యా..
ABN , Publish Date - Feb 04 , 2026 | 07:17 AM
అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలు పున:ప్రారంభం కాబోతున్న దశలో రష్యా మరోసారి దాడులకు పాల్పడింది. రష్యా తమపై 450 దీర్ఘశ్రేణి డ్రోన్‌లతో పాటు భిన్న రకాలైన 70 క్షిపణుల్ని ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు పున:ప్రారంభం కాబోతున్న దశలో రష్యా మరోసారి దాడులకు పాల్పడింది. రష్యా తమపై 450 దీర్ఘశ్రేణి డ్రోన్‌లతో పాటు భిన్న రకాలైన 70 క్షిపణుల్ని ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్ ఉక్రెయిన్ పర్యటనకు ఒక రోజు ముందు కీవ్‌పై ఈ దాడి జరగడం గమనార్హం (Russia Ukraine war).
అబుదాబిలో ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలు బుధవారం పున:ప్రారంభం కాబోతున్నాయి. ఈ చర్చలకు సిద్ధమవుతూనే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది. ఉక్రెయిన్‌లోని ఐదు ప్రాంతాలపై రష్యా ఏకకాలంలో దాడులకు పాల్పడిందని, ఈ సంవత్సరం తమ విద్యుత్ నెట్‌వర్క్‌పై జరిగిన అతి పెద్ద దాడి ఇదేనని ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటెక్ పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు (Ukraine peace deal).
ఉక్రెయిన్‌లో విద్యుత్ సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని, ప్రజలకు వేడిని, వెలుగును అందించే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించేందుకే రష్యా ఈ దాడులకు పాల్పడిందని జెలెన్‌స్కీ ఆరోపించారు (Russia attacks Ukraine). తమకు గగనతల రక్షణ సాధనాలను సరఫరా చేయాలని, దాడులను ఆపేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని మిత్ర దేశాలను ఆయన కోరారు.
ఇవీ చదవండి:
సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు