Home » Russia
డబ్బుల కోసం రష్యా సైన్యంలో చేరడం ప్రమాదకరమైన చర్య అని, దీనికి దూరంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది.
రష్యా సాయుధ దళాల్లో చేరాలని వస్తున్న ఆఫర్ల పట్ల భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి హెచ్చరించింది. డబ్బుపై ఆశతో రష్యా సైన్యంలో చేరి, ఆ తర్వాత భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని బయటకు తీసుకొస్తుందని భావించవద్దని స్పష్టం చేసింది.
రష్యాకు చెందిన అత్యంత శక్తిమంతమైన బాంబర్ విమానం కుప్పకూలింది. విమాన శిక్షణ నిర్వహించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఒకరు మినహా, మిగతా ఆరుగురు సిబ్బంది మృతి చెందారు.
న్యూఢిల్లీలోని ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని బహూకరించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శుక్రవారం నాడు రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఐదుగురు మరణించగా.. 27 మంది గాయపడ్డారు. అమెరికా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ భాగస్వామికి చెందిన గిడ్డంగిపైనా దాడులు జరిగాయి.
రష్యా చమురు విషయంలో సుంకాల విధింపుపై పునరాలోచించుకోవాలని జేపీ మోర్గన్ ఛేజ్ సంస్థ సీఈఓ జేమీ డైమన్ సూచించారు. సుంకాలతో ప్రపంచమార్కెట్లపై పడే ప్రభావం పరిగణనలోకి తీసుకుని నిర్ణయానికి రావాలని సూచించారు.
దిగువ సభకు (స్టేట్ డుమా) జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు పుతిన్ సారథ్యంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది.
రష్యా పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజున ఉక్రెయిన్ వెయ్యి డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని మాస్కో, పరిసర ప్రాంతాలపై చరిత్రలోనే అత్యంత భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో ఇద్దరు మరణించగా, మాస్కోలోని ప్రధాన చమురు రిఫైనరీ తీవ్రంగా దెబ్బతింది.
రష్యాపై కఠినమైన ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.
అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోందని, అదే సమయంలో దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.