US order Putin arrest: పుతిన్‌ను కూడా ఎత్తుకొచ్చేస్తారా.. డొనాల్డ్ ట్రంప్ సమాధానం ఏంటంటే..
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:43 PM
వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా సైన్యం బంధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తమ స్పందనలను ఇప్పటికే తెలియజేశాయి. అమెరికా ఆధిపత్యాన్ని కొన్ని దేశాలు ప్రశ్నించాయి.
వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా సైన్యం బంధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తమ స్పందనలను ఇప్పటికే తెలియజేశాయి. అమెరికా ఆధిపత్యాన్ని కొన్ని దేశాలు ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా అమెరికా బంధించబోతోందని కథనాలు వెల్లడయ్యాయి. తాజాగా మీడియా సమావేశంలో ట్రంప్‌నకు ఈ ప్రశ్న ఎదురైంది (Putin arrest debate).
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను బంధించేందుకు కూడా సైనిక చర్య చేపడతారా అని ట్రంప్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు. 'ఎన్నో ఏళ్లుగా నాకు పుతిన్‌తో మంచి స్నేహ బంధం ఉంది. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ఆయన వైఖరితో విసిగిపోయాను. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల వందల మంది చనిపోయారు. నేను చాలా యుద్ధాలు ఆపాను. కానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం నా వల్ల కాలేదు. అయినప్పటికీ పుతిన్‌పై సైనిక చర్య చేపట్టను' అని ట్రంప్ పేర్కొన్నారు (Trump Russia comments).
వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమర్థించారు (Vladimir Putin news). ఆ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్ట్ గురించి కూడా పరోక్షంగా స్పందించారు. 'నియంతలను ఇలా ఎదుర్కోవడం సాధ్యమైతే.. అలాంటి వారిని ఏం చేయాలో అమెరికాకు తెలుసు' అని కామెంట్ చేశారు. పుతిన్ విషయంలో కూడా అమెరికా ఇలాగే స్పందించాలని జెలెన్‌స్కీ సూచించారు.
ఇవి కూడా చదవండి..
విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయేంటి.. ఆసక్తికర కారణాలు తెలిస్తే..
నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్