China Taiwan issue: నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jan 10 , 2026 | 07:19 AM
వెనెజువెలాపై సైనిక దాడికి పాల్పడి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో ఆసక్తికరంగా స్పందించారు. చైనా కూడా చాలా కాలంగా తైవాన్‌ను ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది.
వెనెజువెలాపై సైనిక దాడికి పాల్పడి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో ఆసక్తికరంగా స్పందించారు. చైనా కూడా చాలా కాలంగా తైవాన్‌ను ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. తాజాగా వెనెజువెలాపై అమెరికా దాడి నేపథ్యంలో చైనా కూడా తైవాన్‌ను ఆక్రమించే ప్రయత్నం చేస్తుందేమోనని అనుమానాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు (Trump Xi Jinping).
'తైవాన్ విషయంలో చైనా అధ్యక్షుడు ఏం చేయబోతున్నారో నాకు అవగాహన లేదు. అది పూర్తిగా ఆయనకే తెలుసు. అయితే ఆయనకు ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పాను. తైవాన్‌పై చర్యలకు పాల్పడితే నేను సంతోషించనని చెప్పాను. నాకు తెలిసినంత వరకు జిన్‌పింగ్ అలాంటి పనులు చేయరు. అమెరికాకు నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తైవాన్‌పై చైనా దాడి చేయదని అనుకుంటున్నా. అమెరికాకు మరో అధ్యక్షుడు వచ్చాక తైవాన్ అంశంపై నిర్ణయం తీసుకుంటారేమో' అని ట్రంప్ వ్యాఖ్యానించారు (US China relations).
అలాగే అంతర్జాతీయ చట్టాలను తాను పట్టించుకోనని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు (Xi Jinping Taiwan decision). తన మనస్సాక్షి ప్రకారమే తాను నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అలాగే గ్రీన్‌లాండ్ కూడా తమ స్వాధీనంలోకి కచ్చితంగా రావాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ నుంచి దూరం చేసేందుకు ఆ దేశ వాసులకు డబ్బులను ఎరగా వేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాతో కలిసే విధంగా గ్రీన్‌లాండ్ వాసులను ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..