Economic Growth: ఈ ఏడాది భారత వృద్ధి 6.6శాతం
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:18 AM
అత్యంత సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణంలో సైతం భారత్ 2026 సంవత్సరంలో 6.6ు వృద్ధిని నమోదు చేస్తుందని ఐక్యరాజ్య సమితి....
టారి్‌ఫల నేపథ్యంలోనూ బలమైన పురోగతి
ఐక్యరాజ్య సమితి అంచనా
ఐక్యరాజ్య సమితి: అత్యంత సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణంలో సైతం భారత్ 2026 సంవత్సరంలో 6.6ు వృద్ధిని నమోదు చేస్తుందని ఐక్యరాజ్య సమితి (యూఎన్) అంచనా వేసింది. కల్లోలిత వాతావరణంలో కూడా ఇది అసాధారణమైన వృద్ధి అని ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి-అవకాశాలు 2026’ పేరు తో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రైవేట్ వినియోగంలో బలం, ప్రభుత్వ పెట్టుబడుల పెంపు, ఇటీవల చేపట్టిన పన్ను సంస్కరణలు, వడ్డీ రేట్ల తగ్గింపు వంటివి అధిక అమెరికా టారి్‌ఫలతో ఏర్పడిన ప్రతికూలతను తటస్థం చేసి దేశాన్ని బలమైన వృద్ధి బాటలో నిలిపే అంశాలని తెలిపింది. ఇటీవలే ముగిసిన 2025 సంవత్సరంలో దేశం 7.4ు వృద్ధి సాధించే ఆస్కారం ఉన్నట్టు తెలియచేసింది. అయితే ఈ ఏడాది అమెరికా టారి్‌ఫల ప్రభావం ఎగుమతులపై మాత్రం పడవచ్చని పేర్కొంది. భారత ఎగుమతుల్లో అమెరికా వాటా 18ు వరకు ఉంటుం ది. టారి్‌ఫల కారణంగా కొన్ని వస్తువుల ఎగుమతులు ప్రభావితమైనా ఎలక్ర్టానిక్స్, స్మార్ట్‌ఫోన్లు వంటివి ఆ ప్రభావానికి దూరంగా ఉంటాయని తెలిపింది. యూరప్, పశ్చిమాసియా వంటి ప్రధాన దేశాల డిమాండ్ మాత్రం బలంగానే ఉంటుందని, ఇవి కూడా అమెరికా టారి ఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదపడే అంశాలని పేర్కొంది. కాగా విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, అధిక టారి్‌ఫల అమలు రూపాయిపై ఒత్తిడిని పెంచాయని, అయితే శక్తివంతమైన పనితీరుతో సమీప భవిష్యత్తులో రూపాయికి మద్దతు లభిస్తుందని తెలిపింది.
నివేదికలోని ముఖ్యాంశాలు...
5.6ు వృద్ధితో దక్షిణాసియా ప్రపంచంలోనే వేగంగా పురోగమిస్తున్న ప్రాంతంగా నిలుస్తుంది. అయితే అందులో కూడా అధిక శాతం వృద్ధి భారత్ నుంచే లభిస్తుంది.
దేశంలో తయారీ, సేవల రంగాలు వృద్ధికి చోదకంగా ఉంటాయి.
స్థూల స్థిర మూలధన వనరుల నిర్మాణంలో బలమైన వృద్ధిని నమోదు చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది.
గత ఏడాది దేశంలో ఉపాధి సూచీలు కూడా స్థిరంగా ఉన్నాయి. అక్టోబరులో నిరుద్యోగిత రేటు 5.2ు ఉంది. సంవత్సరం ద్వితీయార్ధంలో గ్రామీ ణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ కార్మిక శక్తి భాగస్వామ్యం రేటు మెరుగుపడింది.
‘‘భారత ఎగుమతి మార్కెట్లు వైవిధ్యభరితంగా ఉండడం వల్ల టారి్‌ఫల ప్రభావం తక్కువగానే ఉంటుంది. టారి్‌ఫల వల్ల వాణిజ్య ఎగుమతులు కొంత మేరకు ప్రభావితమైనా సేవల ఎగుమతులు భారత్‌కు దన్నుగా నిలుస్తాయి’’
శంతను ముఖర్జీ, డైరెక్టర్, యూఎన్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల డివిజన్
ప్రపంచ వృద్ధి 2.8శాతం
‘‘2026 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు 2.8ు ఉండవచ్చని సమితి అంచనా వేసింది. గత ఏడాది నమోదు చేసిన 2.7ు వృద్ధి కన్నా ఇది స్వల్పంగా తక్కువ. 2027లో వృద్ధి రేటు 2.9ు వరకు ఉండవచ్చని తెలిపింది. అయినా మహమ్మారి ముందు కాలం (2010-2019) సగటు వృద్ధి రేటు 3.2ు కన్నా తక్కువగానే ఉంటుంది. యూరప్, జపాన్, అమెరికాల్లో వృద్ధి రేటులో వేగం నిలకడగానే ఉండవచ్చు’’ అని నివేదిక తెలిపింది. అమెరికా వృద్ధి రేటు సైతం 2024లో నమోదైన 2.8ు నుంచి 2025లో 1.9 శాతానికి దిగజారవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధి 2 శాతానికి, 2027లో 2.2 శాతానికి చేరవచ్చని పేర్కొంది.