Share News

Airplane color reason: విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయేంటి.. ఆసక్తికర కారణాలు తెలిస్తే..

ABN , Publish Date - Jan 10 , 2026 | 10:18 AM

విమానాలు చాలా వరకు దాదాపు తెలుపు రంగులోనే ఉంటాయి. విమానాలన్నీ తెల్లగానే ఉండడానికి గల కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? విమానాలకు తెలుపు రంగును మాత్రమే వేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాట.

Airplane color reason: విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయేంటి.. ఆసక్తికర కారణాలు తెలిస్తే..
surprising airplane facts

ఆకాశంలో విహరించే విమానాల గురించి చాలా విషయాలు సాధారణ ప్రజలకు తెలియవు. విమానం డిజైన్ దగ్గర్నుంచి దానికి వేసే రంగు వరకు ప్రతి దాని వెనకాల ఓ ప్రత్యేకమైన కారణం ఉంటుంది. విమానాలు చాలా వరకు దాదాపు తెలుపు రంగులోనే ఉంటాయి. విమానాలన్నీ తెల్లగానే ఉండడానికి గల కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? విమానాలకు తెలుపు రంగును మాత్రమే వేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయట (why airplanes are white).


విమానాలకు తెలుపు రంగు వేయడం వెనుక భద్రత, ఇంధన ఆదా, తక్కువ ఖర్చు, మెయింటెనెన్స్ సౌలభ్యం మొదలైన కారణాలున్నాయట. ఇతర రంగులతో పోల్చుకుంటే తెలుపు రంగు సూర్య కిరణాలను గ్రహించదు. దాంతో విమానం వేడెక్కదు. ఏసీ వినియోగం తగ్గుతుంది. అలాగే ఇతర రంగులతో పోల్చుకుంటే తెలుపు రంగు బరువు తక్కువగా ఉంటుంది. దీంతో విమానం బరువు తగ్గుతుంది. ఇంధనం ఆదా అవుతుంది (airplane color reason).


తెలుపు రంగులో ఉన్న విమానంపై పగుళ్లు, డ్యామేజ్, ఆయిల్ లీకులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి (aviation facts). మెయింటనెన్స్ సమయంలో లోపాలను వెంటనే గుర్తించి రిపేర్ చేయవచ్చు. అలాగే ఇతర రంగులతో పోల్చుకుంటే తెల్ల రంగు పెయింట్ వేయడానికి తక్కువ ఖర్చు ఉంటుంది. ఎక్కువ లేయర్లు పెయింట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ని ప్రయోజనాలు ఉండడం వల్లే విమానాలకు ఎక్కువగా తెలుపు రంగునే వేస్తారు.


ఇవి కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్

Updated Date - Jan 10 , 2026 | 10:38 AM