Share News

భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి

ABN , Publish Date - Feb 05 , 2026 | 07:23 AM

ప్రపంచంలో ఏ దేశం నుంచైనా చమురును కొనే స్వేచ్ఛ భారత్‌కు ఉందని, విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్‌కు కొత్త కాదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు.

భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి
India US Russia relations

ప్రపంచంలో ఏ దేశం నుంచైనా చమురును కొనే స్వేచ్ఛ భారత్‌కు ఉందని, విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్‌కు కొత్త కాదని రష్యా అధ్యక్ష భవనం, క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు పూర్తిగా ఆపలేవని పెస్కోవ్ వెల్లడించారు (India oil purchase rights).


'అమెరికా ఎగుమతి చేసే షేల్ చమురు తక్కువ గ్రేడ్‌లు కలిగి ఉంటుంది. గ్యాస్ కూడా తక్కువ కండెన్సేట్‌తో ఉంటుంది. వాటితో పోలిస్తే రష్యా ఎక్కువ గ్రేడ్ కలిగిన, సల్ఫర్ అధికంగా ఉండే యూరల్స్‌ను సరఫరా చేస్తుంది. తక్కువ గ్రేడ్లను కలిగి ఉండే చమురును అమెరికా నుంచి భారత్ అధిక ధరకు కొనాల్సి ఉంటుంది. రష్యాకు ప్రత్యామ్నాయం అంత సులభం కాదు. రష్యా రోజుకు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును భారత్‌కు సరఫరా చేస్తోంది. అంత భారీగా అమెరికా చేయలేదు' అని రష్యా జాతీయ ఇంధన భద్రత నిపుణుడు ఐగోర్ యుష్కోవ్ పేర్కొన్నారు (Russia on India oil imports).


'భారత్‌కు రష్యా మాత్రమే ముడి చమురును సరఫరా చేయడం లేదు (India Russia energy ties). ఆ దేశం ఎప్పటి నుంచో ఇతర దేశాల నుంచి కూడా ముడి చమురు కొనుగోలు చేస్తోంది. ఆ విషయం అంతర్జాతీయ ఇంధన రంగంలో ఉన్న నిపుణులందరికీ తెలుసు. ఇక, భారత్, రష్యాల మధ్య హైడ్రోకార్బన్ల వాణిజ్యం ఇరు దేశాలకు లాభదాయకం. ఈ రంగంలో ఇరు దేశాల మరింతగా కలిసి పని చేయాలి' అని దిమిత్రి పెస్కోవ్ ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..


ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు.. దాడులు తీవ్రతరం చేసిన రష్యా..

Updated Date - Feb 05 , 2026 | 08:03 AM