Home » Rahul Gandhi
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ డబ్బుసంచుల కోసం తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తమ్‌రెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు.
‘‘ఈ దేశాన్ని 52 ఏళ్లు పాలించిన రాహుల్ గాంధీ కుటుంబం.. ప్రస్తుతం నివాసం ఉంటున్నది ప్రభుత్వ బంగళాలోనే. వారు సంపాదించిన ఆస్తి అదే.
పాతికమంది పారిశ్రామికవేత్తల కోసం మోదీ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. భారత్‌లో కేవలం ఓ 25 మంది తమ ఇంట పెళ్లిళ్లకు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని, అదే సమయంలో రైతులు, సామాన్య ప్రజలు మాత్రం తమ పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా దేశ ప్రయోజనాలే మిన్నగా జీవితాంతం బతికిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
రక్షణశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి సభ్యత్వం లభించింది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు కమ్యూనికేషన్లు, ఐటీ కమిటీలో చోటు దక్కింది. ఇదే కమిటీలో తృణమూల్‌కు చెందిన ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రాకు స్థానం లభించడం విశేషం.
ముడా (మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
సాగు చట్టాల రద్దు కోరుతూ 700 మంది రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు బలిదానాలు చేసినా బీజేపీ నేతలు సంతృప్తి చెందినట్టుగా లేరని రాహుల్ గాంధీ విమర్శించారు. అన్నదాతలకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేసినా 'ఇండియా' కూటమి అడ్డుకుంటుందన్నారు.
దేశంలో యువతకు ఉపాధి లేకుండా చేసి వారికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఫలితంగా హరియాణా వంటి రాష్ట్రాల్లో యువత విదేశాల బాటపట్టి తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
ప్రధాని మోదీ ‘మనసులోని మాటల’ను చెబుతున్నారే తప్ప ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు సంబంధించిన ‘పనుల మాటల’ను మాట్లాడడం లేదని విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు.