రాహుల్‌పై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత..
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:50 PM
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఏంపీ నిషికాంత్ దూబే గురువారం లోక్‌సభలో 'సబ్‌స్టాంటివ్ మోషన్' దాఖలు చేశారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఏంపీ నిషికాంత్ దూబే గురువారం లోక్‌సభలో 'సబ్‌స్టాంటివ్ మోషన్' దాఖలు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు (Rahul Gandhi Lok Sabha membership).
బీజేపీ ఎంపీ ప్రవేశపెట్టిన ఆ తీర్మానంపై కేంద్రం విముఖంగా ఉన్నట్టు సమాచారం. అయితే రాహుల్‌గాంధీ బుధవారం చేసిన ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 'జార్జ్ సోరోస్ వంటి శక్తుల సహాయంతో రాహుల్ గాంధీ దేశాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో వివరిస్తూ నేను ఈరోజు లోక్‌సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాను. ఈ విషయాన్ని చర్చించాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నా' అంటూ దూబే అన్నారు (Rahul Gandhi disqualification).
అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ గురించి రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో తీవ్ర ఆరోపణలు చేశారు (BJP vs Congress). ఈ ఒప్పందం ద్వారా భారత ప్రయోజనాలను పూర్తిగా అమెరికాకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ ట్రేడ్ డీల్‌ను రాహుల్ గాంధీ 'పూర్తి లొంగుబాటు'గా అభివర్ణించారు. భారతదేశ ఇంధన భద్రతను అమెరికాకు అప్పగించారని, రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..