Share News

మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్‌‌ ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:03 PM

డాలర్‌ ఆధిపత్యంపై కొన్ని దేశాలు పోరాడుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా ఆధిపత్యానికి పలు దేశాలు సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు. ఇంధన, ఆర్థిక రంగాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నాయని చెప్పుకొచ్చారు..

మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్‌‌ ప్రశ్నల వర్షం
Rahul Gandhi

ఢిల్లీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): డాలర్‌ ఆధిపత్యంపై కొన్ని దేశాలు పోరాడుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. అమెరికా ఆధిపత్యానికి పలు దేశాలు సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు. ఇంధన, ఆర్థిక రంగాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌, పాలస్తీనాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని వెల్లడించారు. లోక్‌సభ సమావేశాల సందర్బంగా రాహుల్‌గాంధీ మాట్లాడారు. ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తోందని, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు ఏఐ ప్రమాదం ఉందని పలువురు అంటున్నారని ప్రస్తావించారు.


భారత్‌ డేటానే అమెరికా, చైనాలకు కీలకం..

భారత్‌కు ప్రతిభావంతులైన యువతరం పెద్ద ఆస్తి అని రాహుల్ గాంధీ అన్నారు. ఏఐకి ఇంధనమే డేటా.. అది లేకపోతే ఏఐ శూన్యమని చెప్పుకొచ్చారు. చైనా, భారత్‌.. ప్రపంచంలో అతిపెద్ద డేటా కేంద్రాలని వివరించారు. వ్యవసాయ రంగంలో ఆహారోత్పత్తి భారత్‌కు సానుకూలాంశమని తెలిపారు. ప్రపంచ పరిణామాలను బడ్జెట్‌ ప్రతిబింబించలేదని అన్నారు. భారత్‌ డేటానే అమెరికా, చైనాలకు కీలకమని వివరించారు. అమెరికా సూపర్‌పవర్‌గా కొనసాగాలంటే భారత్‌ డేటానే కీలకమని, గతంలో అధిక జనాభా ఒక సమస్య.. అదే ఇప్పుడు పెద్ద ఆస్తి అని చెప్పుకొచ్చారు. అమెరికా - భారత్‌ ట్రేడ్‌డీల్‌ ఇటీవలే కుదిరిందని అన్నారు. డాలర్‌ను బలోపేతానికి ఈ ట్రేడ్‌ డీల్‌ దోహదపడుతుందని వెల్లడించారు. మన డేటా రక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. డీల్‌లో ఇంధన భద్రతలోనూ తగిన చర్యలు లేవని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 02:15 PM