Home » Lok Sabha
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వం తన శాసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ సమావేశాల్లో ఇప్పటివరకు 19 బిల్లులు ఆమోదం పొందాయి.
విపక్షాల ఆందోళనల నడుమ ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు లోక్‌సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో కేరళ పేరు మార్పు, ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు, గనులు, ఖనిజాల చట్ట సవరణ తదితర బిల్లులున్నాయి.
UPI లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. డిజిటల్ చెల్లింపు సేవలపై రుసుములు వసూలు చేసే అధికారం బ్యాంకులకు కల్పించింది.
పార్లమెంట్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మరోవైపు ఈ సమావేశాలు సజావుగా సాగనందున.. త్వరలోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించే దిశగా కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.
వైస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ రంగం కుదేలైనట్లు పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పాల ఉత్పత్తి తగ్గడం, తలసరి పాల లభ్యత క్షీణించడం వంటి అంశాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని వివరించింది.
లోక్‌సభలో వరుసగా 12వ రోజూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. అయితే.. ఆందోళనల మధ్యే కేంద్రం రెండు బిల్లులను ఆమోదించింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.
పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చల అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిల్లుపై మాట్లాడుతూ.. పేపర్ లీక్‌పై ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బీజేపీ నేతలు, వారి పిల్లలను అడగాలంటూ వ్యాఖ్యానించారు.