Share News

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. మార్చి 9వ తేదీన చర్చ..

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:06 AM

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై మార్చి 9వ తేదీన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్పీకర్‌ను తొలగించే తీర్మానంపై చర్చ బడ్జెట్ సమావేశాల రెండో భాగం మొదటి రోజు అయిన మార్చి 9న జరిగే అవకాశముందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి.

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. మార్చి 9వ తేదీన చర్చ..
Lok Sabha speaker Om Birla

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై మార్చి 9వ తేదీన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్పీకర్‌ను తొలగించే తీర్మానంపై చర్చ బడ్జెట్ సమావేశాల రెండో భాగం మొదటి రోజు అయిన మార్చి 9న జరిగే అవకాశముందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. కాగా, విపక్షాల నోటీసు నేపథ్యంలో తనపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు (Lok Sabha news).


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీకి స్పీకర్ ఓం బిర్లా అవకాశం ఇవ్వలేదని, నిలదీసిన 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న స్పీకర్‌ను తొలగించాలని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీకి మంగళవారం కాంగ్రెస్ నోటీసులు అందజేసింది. దీంతో తనపై వచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసును కొట్టివేసే వరకు సభా కార్యకలాపాలకు హాజరు కాకూడదని ఓం బిర్లా నిర్ణయించుకున్నారు. నోటీసును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సభా ప్రధాన కార్యదర్శిని కూడా ఆయన ఆదేశించారని లోక్‌సభ వర్గాలు తెలిపాయి (no-confidence motion).


కాగా, విపక్షానికి చెందిన మహిళా ఎంపీలు దాడికి ప్రయత్నిస్తారనే సమాచారంతో ప్రధాని ప్రసంగం లేదని సభాపతి స్థానం నుంచి ఓం బిర్లా ప్రకటించడం (Parliament news India), మహిళా ఎంపీలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన బీజేపీ ఎంపీపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో 118 మంది సభ్యుల సంతకాలతో మంగళవారం ఉదయం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశాయి.


ఇవి కూడా చదవండి..

అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్.. భారత్‌కు ఇబ్బందేనా..


బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 11 , 2026 | 11:06 AM