అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్.. భారత్‌కు ఇబ్బందేనా..
ABN , Publish Date - Feb 11 , 2026 | 07:07 AM
భారత్‌పై వాణిజ్య సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 18 శాతానికి తగ్గించడంతో ఎగుమతిదారులు చాలా సంతోషపడ్డారు. అయితే బంగ్లాదేశ్‌తో కూడా అమెరికా ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం నిలువనీయలేదు.
భారత్‌పై వాణిజ్య సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 18 శాతానికి తగ్గించడంతో ఎగుమతిదారులు చాలా సంతోషపడ్డారు. అయితే బంగ్లాదేశ్‌తో కూడా ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం నిలువనీయలేదు. ముఖ్యంగా భారత వస్త్ర పరిశ్రమకు బంగ్లాదేశ్, వియత్నాంల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన తాజా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం భారత వస్త్ర పరిశ్రమను కలవరపెడుతోంది (US-Bangladesh trade deal).
తాజా ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా విధించే సుంకం 20 నుంచి 19 శాతానికి తగ్గనుంది. భారత్‌తో పోల్చుకుంటే బంగ్లాదేశ్ నుంచి ఒక శాతం ఎక్కువ సుంకమే అమెరికా వసూలు చేస్తోంది. అయితే అమెరికా పత్తితో తయారైన బంగ్లాదేశీ వస్త్రాలకు మాత్రం సున్నా శాతం పన్ను అమలవుతుందని ప్రకటించడం భారత్‌కు ఇబ్బందిగా మారింది. తక్కువ లాభాల మార్జిన్‌తో నడిచే వస్త్ర రంగానికి ఇది పెద్ద సవాల్‌గా మారుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది (Indian textile sector).
అంతేకాదు, ఈ నిర్ణయం భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌కు ఎగుమతి అయ్యే పత్తి ఎగుమతులపై కూడా ప్రభావం చూపనుంది (India textile exports). భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు ఎక్కువగా పత్తి ఎగుమతి అవుతుంటుంది. తాజాగా అమెరికాతో ఒప్పందం నేపథ్యంలో బంగ్లాదేశ్ అక్కడి నుంచే పత్తిని దిగుమతి చేసుకుంటుంది. ఆ పత్తితో తయారైన వస్త్రాలను తిరిగి అమెరికాకు ఎగుమతి చేస్తుంది. ఆ వస్త్రాలకు అమెరికాలో ఎలాంటి పన్నూ ఉండదు. దీంతో ధరల పోటీలో భారత్‌పై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు
మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..