Share News

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:26 PM

అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముఠా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు. పాల వ్యాన్‌లో సుమారు 5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు
PDS Rice

తిరుపతి, ఫిబ్రవరి 10: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు. చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా వద్ద మంగళవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో.. పాల వ్యాన్‌లో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తిరుపతి నుంచి కర్ణాటకకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. బియ్యంతో సహా వాహనాన్నీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.


స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం సుమారు 5 టన్నులు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నవారిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. అయితే.. తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి ఎర్రచందనం, కలప తదితర వస్తువులను అక్రమంగా పెద్దఎత్తున తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు కీలక ప్రాంతాలు సహా రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖలో మెట్రో నిర్మాణానికి కేంద్రం ఆమోదం

మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..

For More AP News And Telugu News

Updated Date - Feb 10 , 2026 | 03:51 PM