విశాఖలో మెట్రో నిర్మాణానికి కేంద్రం ఆమోదం
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:26 PM
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు హోం మంత్రి అమిత్ షాతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: విశాఖ నగరంలో మెట్రో నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ స్వయంగా తెలియజేశారు. మంగళవారం ఆయనతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. వైజాగ్, విజయవాడలలో మెట్రో నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను గతంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం.. తొలుత వైజాగ్‌లో మెట్రో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది.
మరోవైపు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో వేర్వేరు భేటీలలో పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై వారితో కూలంకుషంగా చర్చించినట్టు సమాచారం. అలాగే పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పురోగతిని కేంద్రానికి సీఎం చంద్రబాబు సోదాహరణంగా వివరించారు. కేంద్ర మంత్రులతో భేటీల నిమిత్తం.. సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం: బండ్ల గణేశ్
మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..
For More AP News And Telugu News