Share News

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:16 PM

కాంగ్రెస్ మహిళా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను మహిళా ఎంపీలు ఆ లేఖలో తీవ్రంగా ఖండించారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ
Congress women MPs letter

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కాంగ్రెస్ మహిళా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను మహిళా ఎంపీలు ఆ లేఖలో తీవ్రంగా ఖండించారు. ఇంకా ఆ లేఖలో.. ‘విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాస్తున్నారు. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మా నిరసన ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగానే కొనసాగింది. మేము సభలో హింసకు దిగాలనుకోలేదు. ప్రధానికి విపక్షాలను ఎదుర్కొనే ధైర్యం లేదు. మేము దాడి చేస్తామని కాదు.. మాకు భయపడి లోక్‌సభకు ప్రధాని రాలేదు. లోక్‌సభ స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండాలి ’ అని మహిళా ఎంపీలు రాసుకొచ్చారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా వైపుగా కాగితాలను విసిరినందుకు 8మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. మాణిక్కం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఔజ్లా, అమరీందర్ సింగ్ రాజా, కిరణ్ కుమార్ రెడ్డి, హిబీ ఈడెన్, డీన్ కురియకోస్, ప్రశాంత్ పడోలేతో పాటు సీపీఎమ్‌కు చెందిన ఎస్.వెంకటేశన్‌ను మిగిలిన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదంటూ లోక్‌సభ స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లాపై కాగితాలు విసిరిన ఎంపీలపై చర్యలు కోరుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించడంతో సస్పెన్షన్ వేటు పడింది.


ఇవి కూడా చదవండి..

హార్వర్డ్‌కు పోయినా రేవంత్‌రెడ్డి మారడు.. హరీశ్‌రావు సెటైర్లు

చాక్లెట్ డే.. ఎందుకు జరుపుకొంటారో తెలుసా?

Updated Date - Feb 09 , 2026 | 01:50 PM