Share News

లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం.. అప్పటి వరకూ సభకు దూరం

ABN , Publish Date - Feb 10 , 2026 | 07:49 PM

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం.. అప్పటి వరకూ సభకు దూరం
Om Birla

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం (No confidence Motion)పై చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీకి కాంగ్రెస్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు.


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీకి స్పీకర్ అవకాశం ఇవ్వలేదని, నిలదీసిన 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని విపక్షాలు తప్పుపడుతున్నాయి. విపక్షానికి చెందిన మహిళా ఎంపీలు దాడికి ప్రయత్నిస్తారనే సమాచారంతో ప్రధాని ప్రసంగం లేదని సభాపతి స్థానం నుంచి ఓం బిర్లా ప్రకటించడం, మహిళా ఎంపీలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన బీజేపీ ఎంపీపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో 118 మంది సభ్యుల సంతకాలతో మంగళవారం ఉదయం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశాయి. కాగా, దీనికిముందు అధికార పార్టీకి తలొగ్గి తమపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ ఓం బిర్లాకు రాసిన లేఖలో కాంగ్రెస్ మహిళా ఎంపీలు నిరసన తెలిపారు.


ఇవి కూడా చదవండి..

సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు

బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్

Updated Date - Feb 10 , 2026 | 09:46 PM