Home » Om Birla
నీట్ పరీక్ష వివాదం.. విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన ఒక అధికారిక లేఖ రాశారు.
పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చల అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు.
పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లాంఛనంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారంనాడు లేఖ రాసింది. పార్లమెంటులో శివసేన యూబీటీ మాత్రమే అధికారిక గుర్తింపు కలిగిన పార్టీ అని ఆ లేఖలో తెలియజేసింది.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సుమారు 20 మంది టీఎంసీ రెంబల్ ఎంపీలు త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీతో విలీనమవుతున్నట్టు ప్రకటించారు.
తృణమూల్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో రగులుతున్న తిరుగుబాటు ఎంపీలు తమదే 'నిజమైన టీఎంసీ' పార్లమెంటరీ గ్రూప్ అని క్లెయిమ్ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
టీఎంసీలో తలెత్తిన తిరుగుబాటు పార్లమెంటుకు పాకింది. పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. దీనికి కొనసాగింపుగా 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్టు పార్టీవర్గాలు తెలిపాయి.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టి చర్చకు అనుమతించాలని ఎంపీలు కోరారు.
ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో గదుల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, 11 అనే సంఖ్యకు మధ్య ఉన్న విచిత్రమైన సంబంధం ఈ ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
తాను ఎల్లప్పుడూ సభ నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడే విధులు నిర్వర్తించానని, ఇకపైనా తన విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగానే నిర్వహిస్తానని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.