Share News

e-Cigarettes in Parliament: పార్లమెంట్‌లో ఈ-సిగరెట్ దుమారం.. చర్యలు తీసుకుంటామన్న స్పీకర్.!

ABN , Publish Date - Dec 11 , 2025 | 07:47 PM

గురువారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ఈ-సిగరెట్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఓ టీఎంసీ ఎంపీ.. సభలో ఈ-సిగరెట్ తాగారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లేవనెత్తారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

e-Cigarettes in Parliament: పార్లమెంట్‌లో ఈ-సిగరెట్ దుమారం.. చర్యలు తీసుకుంటామన్న స్పీకర్.!
BJP MP Anurag Thakur

ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ సమావేశాల్లో(Parliament Meetings) గురువారం ఈ-సిగరెట్(E-Cigarette) వ్యవహారం దుమారం రేపింది. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ(TMC MP) ఒకరు ఈ-సిగరెట్ తాగారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్(Anuragh Thakur) సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో చాలా కాలంగా వాటిపై నిషేధం ఉంది. సదరు టీఎంసీ ఎంపీ అందుకోసం అనుమతి పొందారా అని సభాపతిని అడగ్గా.. లేదని సమాధానమిచ్చారు స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla).


నిషేధంలో ఉన్న ఈ-సిగరెట్లను లోక్‌సభలో తాగి.. నిబంధనలను ఉల్లంఘించిన ఆ ఎంపీపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు అనురాగ్ ఠాకూర్. పలువురు బీజేపీ ఎంపీలు కూడా ఠాకూర్‌కు మద్దతు తెలిపారు. స్పందించిన స్పీకర్.. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించారని రుజువైతే సదరు ఎంపీపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా, బీజేపీ ఆరోపణలపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్(MP Saugata Roy) మాట్లాడారు. పార్లమెంట్ భవనం వెలుపల ఈ-సిగరెట్ సేవించేందుకు అనుమతి ఉందన్న ఆయన.. తాము భవనంలో లోపల ధూమపానం చేయలేదని, బయట అందుకు అనుమతి ఉందన్నారు.


2019 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ-సిగరెట్ల అమ్మకాలు, ఉత్పత్తి, నిల్వలను పూర్తిగా నిషేధం విధించింది. ఎలక్ట్రానిక్ నిషేధ చట్టం(PECA) 2019 కింద ఈ నిబంధనలను అమలు చేసింది. నిషేధమున్న ఈ-సిగరెట్ల అమ్మకాలు పెరుగుతున్న తరుణంలో.. ఈ ఉల్లంఘనలను ప్రజలకు తెలియజేయడంలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023లో ఓ ఆన్‌లైన్ పోర్టల్‌నూ ప్రారంభించింది.


ఇవీ చదవండి:

ఓటుచోరీ గురించి మాట్లాడమంటే అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారు: రాహుల్

ఇండిగో కీలక నిర్ణయం.. ఆ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.!

Updated Date - Dec 11 , 2025 | 08:17 PM