Share News

EC Extends SIR: ఆ ఆరు రాష్ట్రాల్లో 'సర్' గడువు పొడిగింపు.. బెంగాల్‌కు నో ఛాన్స్.!

ABN , Publish Date - Dec 11 , 2025 | 06:16 PM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 5 రాష్ట్రాలు సహా యూటీలకు గడువు పొడిగించింది. బెంగాల్‌కూ ఛాన్స్ వస్తుందని భావించినా.. ఈసీ అవకాశమివ్వలేదు.

EC Extends SIR: ఆ ఆరు రాష్ట్రాల్లో 'సర్' గడువు పొడిగింపు.. బెంగాల్‌కు నో ఛాన్స్.!
EC Extends SIR

ఇంటర్నెట్ డెస్క్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 'సర్' గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. తమిళనాడు(Tamilnadu), గుజరాత్(Gujarat), మధ్యప్రదేశ్(Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ & నికోబార్ దీవుల(Andaman and Nicobar Islands)కు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.


రాష్ట్రాల వారీగా సవరించిన గడువు వివరాలు:

  • తమిళనాడు, గుజరాత్ - డిసెంబర్ 14 వరకు

  • మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ & నికోబార్ దీవులు - డిసెంబర్ 18

  • ఉత్తర్ ప్రదేశ్ - డిసెంబర్ 26


అయితే.. రెండో దశ కింద మొత్తం 12 రాష్ట్రాల్లో, యూటీల్లో 'సర్' ప్రక్రియ చేపట్టింది ఈసీ. అందులో భాగంగా డిసెంబర్ 11లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. గోవా(Goa), లక్షద్వీప్(Lakshadweep), రాజస్థాన్(Rajasthan), పశ్చిమ్ బెంగాల్‌(West Bengal)లలో ఈ గడువు నేటితో ముగిసింది. ఈ నాలుగు రాష్ట్రాల ముసాయిదా ఓటర్ల జాబితా డిసెంబర్ 16 ప్రచురించనున్నట్టు ఈసీ తెలిపింది. 2026లో పశ్చిమ్ బెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో.. 'సర్' గడువు పొడిగిస్తారని అంతా భావించారు. కానీ, ఈసీ ఆ అవకాశం లేకుండా చేసింది.

తాజా పొడిగింపునకు ముందు ఈసీ కేరళ షెడ్యూల్‌ను సవరించింది. డిసెంబర్ 18 వరకూ గడువు నిర్దేశించింది. ఈనెల 23న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామని పేర్కొంది.


ఇవీ చదవండి:

ఓటుచోరీ గురించి మాట్లాడమంటే అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారు: రాహుల్

ఇండిగో కీలక నిర్ణయం.. ఆ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.!

Updated Date - Dec 11 , 2025 | 06:23 PM