IndiGo Offer: ఇండిగో కీలక నిర్ణయం.. ఆ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.!
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:59 PM
తీవ్ర సంక్షోభ పరిస్థితుల నుంచి సాధారణ స్థితికి చేరుకుంటున్న ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇటీవల రద్దైన విమాన సర్వీస్ ప్రయాణికులకు రూ.10వేల వరకూ పరిహారం చెల్లిస్తామని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభంలో ఇరుక్కున్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో(IngiGo).. పరిస్థితులు ఇప్పుడు దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల.. ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది(IndiGo Offer). వారికి పరిహారం కింద రూ.10 వేల విలువైన ట్రావెల్ ఓచర్(Travel Voucher) అందిస్తామని స్పష్టం చేసింది.
ఇండిగో సంస్థకు చెందిన వందలాది విమానాలు ఒక్కసారిగా రద్దవడంతో.. ఈనెల 3, 4 , 5 తేదీలలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేల మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టు(Airport)ల్లో చిక్కుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగిస్తూ.. పరిహారం చెల్లించే దిశగా ముందడుగేసింది ఇండిగో. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) మార్గదర్శకాలకు అనుగుణంగా బాధిత ప్రయాణికులకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ ఎక్స్‌గ్రేషియా(Exgratia) అందిస్తున్నట్టు పేర్కొంది. రద్దైన విమానాల కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరిన ఇండిగో.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకుంటామంది.
కంపెనీ అందించే ఈ ట్రావెల్ ఓచర్ విలువ రూ.10వేల వరకూ ఉండనుంది. రానున్న 12 నెలల్లో తమ సంస్థకు చెందిన ఫ్లైట్లలో ప్రయాణించేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది ఇండిగో. అయితే.. ఏయే ప్రయాణికులకు ఎంత మేర పరిహారం కింద చెల్లిస్తారనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇవీ చదవండి: